Friday, February 13, 2026

– అన్ని శాఖల అధికారులకు బెండెత్తిన శాసనసభ్యులు..- శాసనసభ్యులనే గౌరవం లేకుండా అధికారుల ప్రవర్తన..- నియోజకవర్గ శాసనసభ్యులు పర్యటిస్తుంటే అధికారులు ఏమైపోయారని ఆగ్రహం.. – ప్రజా సమస్యలపై బాధ్యత లేదా అంటూ మండిపాటు..- తమాషా చేస్తున్నారా ఇకపై నేనేంటో చూపిస్తానంటూ ఫైర్..- కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన ఎంపీ.. మిథున్ రెడ్డి

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 24 ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని బీ.కొత్తకోట నగర పంచాయతీ కేంద్రమైన స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ల సమైక్యతలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పిర్యాదుల సేకరణ కార్యక్రమానికి ఇరువురు విచ్చేశారు. వీరి వెంట వందలాది మంది వైసీపీ సైనికులు హోరున నినాదాలు చేస్తూ పూల వర్షం కురిపిస్తూ స్వాగతించారు. కార్యాలయంలోనికి విచ్చేసిన మిథున్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డిలకు నూతన ఎంపీపీ రాధ ప్రదీప్ రెడ్డి, మాజీ ఎంపీపీ పాగొండ ఖలీల్ అహ్మద్, ప్రచార విభాగ అధ్యక్షుడు అయూబ్ భాష, సద్దాం, టౌన్ అధ్యక్షుడు చిన్ని కృష్ణ, యువత ఏకమై గజమాలను వేసి దుశ్శాలువలు కప్పి పూల బొకే అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ శ్రేణులు సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి విచ్చేసిన నాయకులు, ప్రజా పరిష్కార కార్యక్రమానికి విచ్చేసిన బాధితులు, పెద్దలు కూర్చోవడానికని షామియానా, కుర్చీలను ఏర్పాటు చేశారు. కొంత మంది అధికారులు కలగజేసుకొని వేసిన షామియానా తొలగించి వేసిన కుర్చీలను వెనక్కి పంపించారు. దీంతో ప్రజా సమస్య పరిష్కార కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలు మండుటెండలో నిలబడాల్సి వచ్చింది. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజల నుంచి వారి సమస్యలను పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి లు స్వయంగా అడిగి తెలుసుకొని వినతిపత్రాలు తీసుకున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి నేరుగా ప్రజలతో మమేకమై ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారికున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకొని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా పరిష్కార వేదిక విచ్చేసిన ప్రజలు మండిపడుతూ దీంట్లో కూడా కూటమి ప్రభుత్వానికి కొందరు అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఇలా ఏర్పాటు చేసిన వాటిని తొలగించడం సబబు కాదని మండిపడ్డారు. దీంతో అధికారుల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో ద్వారకానాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. శాసనసభ్యులు అనే గౌరవం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని అధికారపార్టీకి కొమ్ము కాస్తారా అంటూ ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదని నేడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు. రేపు పార్టీ మారచ్చు. అధికారులు మాత్రం విరమణ చేసేవరకు పార్టీలకతీతంగా పని చేయాల్సి వస్తుందని ఇవన్నీ మరచి తంబళ్లపల్లె నియోజకవర్గం లో అధికారులు అదికార పార్టీకి తొత్తుల వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద తిప్ప సముద్రం మండలంలో ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున పర్యటిస్తే గ్రామస్తుల సమస్యల పరిష్కరించేందుకు ఒక అధికారి కూడా రాకపోవడం మీ ఆహంకారానికి పరాకాష్ట అంటూ మండిపడ్డారు. వైసీపీ అధికారంలో లేకపోవచ్చు. వైసీపీ తరఫున నేను శాసనసభ్యులుగా గెలిచాను. నేను కార్యక్రమాలు చేపడితే ఒక అధికారి కూడా పాల్గొన్నారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గ శాసనసభ్యులు గ్రామాలలో పర్యటించేందుకు వస్తున్నారంటే అధికారులకు ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారని ప్రజా సమస్యలు మీకు కనిపించవా అంటూ ప్రశ్నించారు. ఎంతసేపు సచివాలయాల్లో కబుర్లు చెప్పుకుంటూ ఎంపిడిఓ కార్యాలయంలో కాలక్షేపం చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్న అధికారులకు ఇదే హెచ్చరిక అంటూ ఇకపై నేనేంటో చూపిస్తానని ద్వారకానాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో అధికారుల వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. అనంతరం మిథున్ రెడ్డి మాట్లాడుతూ తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించి సమస్యలపై కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. హంద్రీనీవా కాలువలు లైనింగ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మాదిరిగా హంద్రీనీవా నీటి ద్వారా నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీళ్లు నింపి రైతన్నలకు బాసటగా నిలవాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావివ్వకుండా రైతన్నల పరిస్థితిని గుర్తు పెట్టుకొని అన్ని చెరువులకు హంద్రీనీవా ద్వారా నీళ్లను నింపి రైతన్నలకు సహకరించాలని మిథున్ రెడ్డి కోరారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో నీళ్లు స్టోర్ చేసేందుకు ఎక్కడ అనువైన స్థలం లేదన్నారు. నీళ్లు స్టోర్ అయితే పంటలు సాగు చేసేందుకు రైతన్నలు ఏ పంట పెట్టడానికైనా ముందుంటారని తంబళ్లపల్లి నియోజకవర్గ ప్రజలకు తలమానికమైన ముదివేడు రిజర్వాయర్ పనులు సాగుతుండగా తెలుగుదేశం పార్టీ శతవిధాల ప్రయత్నించి దాదాపుగా పూర్తవుతున్న రిజర్వాయర్ పనులను ఆపి పాపం మూట గట్టుకుందని ఆరోపించారు. రిజర్వాయర్ కొరకు భూములిచ్చిన రైతన్నలకు పేమెంట్ ఇవ్వాలని ఆరోపిస్తూ కోర్టులో కేసు వేశారని ఆరోపించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం ఎక్కడో తెలంగాణలో లేదు. ఆంధ్రాలోనే ఉందని గ్రహించి రాజకీయ కక్ష సాధింపుపక్కనపెట్టి ఇక్కడ రైతన్నలను గుర్తించి ఈ ప్రాంత రైతులు అంతా వ్యవసాయంపైనే ఆధారపడ్డారని గ్రహించి వాళ్ల నోట్లో మట్టి కొట్టకుండా రైతులను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అధికార ప్రభుత్వం మీదేనని మీ వళ్లే ముదివేడు రిజర్వాయర్ పనులు ఆగిపోయాయని మనసాక్షిని ప్రశ్నించి మీరే రిజర్వాయర్ ను పూర్తిచేయాలని మిథున్ రెడ్డి అన్నారు. కేవలం కుప్పం ఒకటే కాదని తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కుప్పం మీద పెట్టిన ధ్యాస తంబళ్లపల్లి నియోజకవర్గంపై కూడా పెట్టాలని మిథున్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ఆముదాల మధుసూదన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బైసాని చంద్రశేఖర్ రెడ్డి, వలసపల్లి రవి, సురేంద్రనాథ్, మాలిక్, ఉమాపతి రెడ్డి, గుర్రం రమేష్, మహిళా విభాగం అధ్యక్షురాలు దేవిరెడ్డి పద్మజా రెడ్డి, టెలికాం అడ్వైజరి మెంబర్ ముట్ర దామోదర్ రెడ్డి, వైసీపీ అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధి గూడుపల్లి జయ సింహారెడ్డి, అన్నమయ్య జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు పాగొండ ఖలీల్ అహ్మద్, ఎంపీపీ రాధ ప్రదీప్ రెడ్డి, ములకలచెరువు మండలాధ్యక్షులు కోటిరెడ్డి మాధవరెడ్డి, కొట్టి మల్లికార్జున, జడ్పీటీసీలు మోహన్ రెడ్డి, ఉంగరాల శివన్న, పిటిఎం ఎంపీపీ మహమ్మద్, సర్పంచులు రవికుమార్ రెడ్డి, సుబ్బిరెడ్డి, మంజునాథరెడ్డి, లక్ష్మీనారాయణ, లోకేష్, ఎంపీటీసీలు రామ సుబ్బారెడ్డి, కో ఆప్షన్ నాసీర్, నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు, యువ నాయకులు ఎస్ఎస్ ఫయాజ్, జాబీర్, నక్క మహేష్, సద్దాం, పాగొండ రఫీ, సమీ, సాయి, బసిరెడ్డి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News