Friday, February 13, 2026

-అసంపూర్తిగా గంగిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల -వెంటనే భవనాలను పూర్తి చేయాలని డిమాండ్. -పిడి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు సికిందర్ మంచిర్యాల జిల్లా

నేటి సాక్షి డిసెంబర్ 23 జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో చదివే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పిడి ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ డిమాండ్ చేశారు. ఈ పాఠశాలలో 24 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఆ పాఠశాల నూతన భవనానికి స్థానిక ఎమ్మెల్యే 2024 మార్చి నెలలో శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు నిధులు మంజూరు చేయక పోవడం తో గంగి పల్లి lo పాఠశాలను పూర్తి చేయలేదన్నారు విద్యార్థులు తరగతి గదులు లేనందువల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని. ఓకే గదిలో మూడు తరగతుల విద్యార్థులు చదవడం వలన ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. అని అన్నారు మరో గదిలో వంటగది పక్కన ఉండడంవల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదన్నారు కాబట్టి విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు,స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాన్ని పూర్తి చేయాలని పి డి ఎస్ యు విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News