నేటి సాక్షి తిరుపతి * (బాదూరు బాల) తిరుపతి, రూరల్ డిసెంబర్25: ఆధ్యాత్మిక భక్తి భావంతోనే లోక కళ్యాణం సుఖమే జీవితం సాధ్యమని ప్రముఖ నంది అవార్డు గ్రహీత, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చక్రధర్ సిద్ధాంతి, జానపద వృత్తి కళాకారుల సంగం వ్యవస్థాపక అధ్యక్షులు పులిమామిడి యాదగిరి, పూతలపట్టు సీఐ గోపీనాథ్, తిరుచానూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మౌనిక మునిశేఖర్లు పేర్కొన్నారు. ధనుర్మా సన్న పురస్కరించుకొని దుర్గ సంవత్సరం జగనన్న కాలనీ వద్ద ఉండాలా గంగమ్మ ఆలయ ధర్మకర్త కామసాని నరసింహారెడ్డి రత్నమ్మ దంపతులు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాట మహోత్సవాలు కోలహలంగా సాగాయి. అన్నమయ్య త్యాగయ్య కనకదాసు అన్నమయ్య త్యాగయ్య కనకదాసు కీర్తనలు,కోలాటాలు భజనలతో ఆ ప్రాంతం సందడిగా మారింది. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ నాటి పూర్వికులు మనకు అందించిన భక్తి భావాన్ని భావితరాలకు అందిస్తూ గ్రామ దేవతల పూజలు, ఉత్సవాలు నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పిల్లలలో ఆధ్యాత్మిక భక్తి కుసుమాలను పూజించవలసిన గురుతర బాధ్యత నేటి సమాజంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జానపద గుత్తి కళాకారుల సంఘం నాయకులు మునీంద్ర సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేశవులు కోలాటం గురు అనిల్ వాసు దంపతులు, గాజుల రవి రాయల్, మురగయ్య, ఆర్ సి పురం మండల టిడిపి మహిళా అధ్యక్షురాలు గుణసుందరి, భక్తులు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

