నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)—————————-చిత్తూరు- (23-12-25)—————————-వివిధ కారణాలు, పలు రకాల వ్యాధులతో ఆసుపత్రుల పాలై, ఆర్థికంగా చితికి పోయిన ఆప్తులకు ఆపన్న హస్తాన్ని అందిస్తున్నారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అండగా నిలుస్తున్నారు.చిత్తూరు ఎంపీ సిఫార్సుతో.., ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 7,52,780 లక్షల రూపాయల విలువైన చెక్కులను మంగళవారం చిత్తూరు ఎంపీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్ళతో కలిసి ఆర్తులకు అందించారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.వారి కుటుంబ నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆపదలో ఉన్న వారికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసానిచ్చారాయన. మానవీయతకు పెట్టింది పేరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట పెన్నిధి అన్నారు.సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందుకున్న ఆర్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.





