నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ( కోక్కుల వంశీ )రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ఎస్సై బి.శ్రీనివాస్ ను మానాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూం జలపతి, మానాల గ్రామ ఉపా సర్పంచ్ దాసరి అశోక్, రాష్ట్ర ఓబీసీ సెల్ జాయింట్ సెక్రటరీ జక్కు వంశీ, మానాల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి జక్కుల లక్ష్మీ నర్సయ్య, ముదిరాజ్ యూత్ అధ్యక్షుడు నాంచారి రాకేష్ లు ఎస్సై శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూం జలపతి మాట్లాడుతూ… రుద్రంగి మండలంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని రకాలుగా పోలీస్ శాఖ వారికి సహకరిస్తామని అన్నారు. ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ… చట్టాల పరిరక్షణకు మీ అందరి సహకారం అందించాలని వారిని కోరారు.

