Tuesday, February 17, 2026

*ఓటర్ జాబితా సవరణను అప్రమత్తంగా నిర్వహించాలి** మ్యాపింగ్‌లో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు* కోరుట్లలో ఓటర్ జాబితా మ్యాపింగ్ అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ (SIR) ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్.లత అధికారులను ఆదేశించారు. కోరుట్ల పట్టణ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ఓటర్ జాబితా మ్యాపింగ్ అవగాహన సదస్సులో ఆమె పాల్గొని అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.*డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలపై ప్రత్యేక దృష్టి*ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ…కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలను నూతన ఓటర్ జాబితాల్లో పూర్తిస్థాయిలో గుర్తించి సరిచేయాలని సూచించారు.ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతగా పరిగణించి, నిర్దేశిత గడువులోగా అన్ని దశలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.*ఒక కుటుంబం – ఒకే పోలింగ్ స్టేషన్‌లో ఓటర్లు*ముఖ్యంగా ఒక కుటుంబానికి చెందిన సభ్యులందరి ఓటర్లు అదే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేలా మ్యాపింగ్ చేయాలని తెలిపారు.సంతాన వివరాలను సమగ్రంగా సేకరించి, సంతానం పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నట్లయితే వాటిని కూడా తప్పకుండా మ్యాపింగ్ చేయాలని సూచించారు.*డూప్లికేట్ ఎంట్రీలకు చెక్*ఓటర్ జాబితాలో ఒకే వ్యక్తికి సంబంధించిన సమానమైన వివరాలతో ఉన్న డూప్లికేట్ ఎంట్రీలు,తప్పుగా నమోదైన ఓటర్ వివరాలను తప్పనిసరిగా పరిశీలించి సవరణలు చేపట్టాలని స్పష్టం చేశారు.బీఎల్‌వోలు, ఎమ్మార్వోలు, డీటీలకు, సూపర్‌వైజర్లకు స్పష్టమైన బాధ్యతలు కేటాయించి, ఓటర్ జాబితా పూర్తిగా తప్పులులేని, విశ్వసనీయమైనదిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అవగాహన సదస్సులోకోరుట్ల ఎమ్మార్వో కృష్ణ చైతన్య,డిప్యూటీ తహసీల్దార్లు,ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News