Friday, May 15, 2026

*కటికనపల్లిలో టీబీ నిర్ధారణ చెస్ట్ ఎక్స్‌రే క్యాంపు*

నేటి సాక్షి, ధర్మారం: ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలో టీబీ వ్యాధి నిర్ధారణకు నిక్షయ్ శివిర్ ఫేస్-2లో భాగంగా సోమవారం మొబైల్ పోర్టబుల్ చెస్ట్ ఎక్స్‌రే క్యాంపు నిర్వహించారు. మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 127 మందికి ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణకు ల్యాబ్ కు పంపించినట్లు వైద్యాధికారిని డాక్టర్ సుస్మిత తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సుస్మిత మాట్లాడుతూ… టీబీ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే తగు జాగ్రత్తలు తీసుకొని పూర్తిగా నయం చేయవచ్చని పేర్కొన్నారు. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చేపూరి లచ్చయ్య, ఉప సర్పంచ్ భువనగిరి అజయ్ కుమార్, వార్డు సభ్యులు, ఎస్టీఎస్ తిరుపతి, ఎం ఎల్ హెచ్ పి డాక్టర్ గౌతమ్, హెచ్ఈఓ నరసింహారెడ్డి, హెచ్ఎస్ దేవి జయ, ఏఎన్ఎంలు స్వరూప, రాజమణి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News