Tuesday, February 17, 2026

*కవితమ్మను ఓడించేంత శక్తి నాకు ఉందా.?*—* అలాగని బలహీనుణ్ణి మాత్రం కాదు.!* రాజకీయాల్లోకి వచ్చింది సేవ కోసమే.. వ్యక్తిగత లాభాల కోసం కాదు* మున్సిపల్ అవినీతిని ముందే హెచ్చరించా.. ప్రోత్సహించను* జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్—*

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చానని, సొంత ప్రయోజనాల కోసం కాదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కవితమ్మను ఓడించేందుకు ప్రయత్నించానన్న ఆరోపణలను ఖండించిన ఆయన, కేసీఆర్ కుమార్తెను ఓడించేంత శక్తి తనకు ఉందా..? అని ప్రశ్నించారు. అలాగని తాను బలహీనుడిని కూడా కాదని వ్యాఖ్యానించారు.*ప్రజాసేవ కోసమే రాజకీయాలు*జగిత్యాల పట్టణంలోని మోతే కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను సొంత లాభం కోసం చేస్తున్నామని విమర్శించడం సరికాదన్నారు. ప్రజలకు విస్తృతంగా సేవ చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. ఎల్‌ఎల్ గార్డెన్ నుంచి రాజేశం గుట్ట వరకు రోడ్డు నిర్మాణం విషయంలో సీనియర్ నాయకులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు.*జగిత్యాల మున్సిపల్ అవినీతిపై హెచ్చరిక*జగిత్యాల మున్సిపల్‌లో జరుగుతున్న అవినీతి తన దృష్టికి వచ్చిన వెంటనే అధికారులను అప్రమత్తం చేశానని ఎమ్మెల్యే తెలిపారు. తీరు మార్చుకోకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని కూడా హెచ్చరించానన్నారు. అయినా మున్సిపల్‌లో జరిగిన అవినీతి విషయంలో తనపై నిందలు మోపడం అన్యాయమని వ్యాఖ్యానించారు. 2020 వరకు జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులే మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఉన్నారని గుర్తు చేస్తూ, 2014 ఎన్నికల్లో తాను ఓడిపోయిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్‌ను కలిసి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరు కోసం ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు.*కవితమ్మ ప్రోత్సాహం.. అభివృద్ధిపై దృష్టి*కవితమ్మ ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెల్లడించారు. 2018లో ఆమె సహకారంతో కేసీఆర్‌ను ఒప్పించి నూకపల్లి (నూకపల్లి)లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులు ప్రారంభించానన్నారు. కాంట్రాక్టర్ పనులు వదిలేసి వెళ్లడంతో గౌరీ శంకర్ అనే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాల్సి వచ్చిందని వివరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నానని, కేంద్ర నిధుల కోసం ఎంపీతో మాట్లాడి నిధులు మంజూరు చేయించానని తెలిపారు. రాజకీయ విమర్శలు సహజమేనని, కానీ అవి సూచనల మాదిరిగా ఉండాలన్నారు._________

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News