Saturday, February 14, 2026

కారు ప్రమాదంలో ఐదుగురు.కాగజ్నగర్. వాసులు.మృతి.విషాదఛాయలో కాగజ్నగర్ పట్టణం ఐదుగురి మృతి ముగ్గురు పరిస్థితి విషమం

నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 25 lకొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణానికి చెందిన ఒక కుటుంబం మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణానికి వైద్యం నిమిత్తం వెళ్లి వస్తుండగా బుధవారం అర్ధరాత్రి దాటాక. మహారాష్ట్ర తెలంగాణ బోర్డర్. దేవాడ సమీపంలోని బ్రిడ్జి పైనుండి వారు ప్రయాణిస్తున్న కారు కింద పడగా ముగ్గురు మహిళలు. అక్కడికక్కడే ఒక బాలిక ప్రమాద స్థలంలోనే చనిపోయినట్టు. ఒకరు ఆసుపత్రిలో చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతి చెందిన వారు కాగజ్నగర్ పట్టణానికి చెందిన మహిళలు అని నిజాముద్దీన్ కాలనీకి చెందిన ఆటో నడుపుకొని జీవనం కొనసాగిస్తున్న జాకీర్ యొక్క భార్య,సల్మా బేగం, కూతురు శబ్రీమ్, మరియు 14, నంబర్ వార్డుకు చెందిన వారి బంధువులు ఇద్దరు మహిళలు ఆఫ్జా బేగం, సహార కూడా మృతి చెందినట్లు జాకీర్ తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చంద్రపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కారులో మొత్తం తొమ్మిది మంది ఉన్నట్టు తెలిపినారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News