Thursday, March 5, 2026

కార్పొరేటర్ టికెట్ సుధాకర్ గౌడ్, మాధవరెడ్డిలకు ఇవ్వాలని తీర్మానం – ఎమ్మెల్యే ఆశీర్వాదంతో అభ్యర్థులను గెలిపించుకొని తీరుతాం-ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేసిన నాలుగు బస్తీల పెద్దలురాజేంద్రనగర్

(నేటి సాక్షి ) ఫిబ్రవరి:4 ప్రతినిధి.గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మైలార్ దేవ్ పల్లి, కాటేదన్ డివిజనులకు సంబంధించిన కార్పొరేటర్ టికెట్ ను బీసీ నేత, సీనియర్ నాయకుడు సుధాకర్ గౌడ్ కు కేటాయించి తమ బస్తీ నేతలకు ఈసారి ఒక్క అవకాశం కల్పించాలని పలువురు నేతలు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు విజ్ఞప్తి చేశారు. బుధవారం అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని నేతాజీ నగర్ లో బుద్వేల్ రైల్వే స్టేషన్, వెంకటేశ్వర కాలనీ, శ్రీరామ్ నగర్, నేతాజీ నగర్ కు చెందిన నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో సీనియర్ నేత సుధాకర్ గౌడ్ కానీ మాధవరెడ్డిలకు టికెట్ కేటాయించేలా ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని ముర్తకంఠంతో సుమారు 150 మంది బస్తి పెద్దలు తీర్మాణించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… తమ కాలనీల అభివృద్ధి కోసం ఈసారి కార్పొరేటర్ టికెట్ ను బీసీ రిజర్వేషన్ ప్రకారం సుధాకర్ గౌడ్, జనరల్ రిజర్వేషన్ ప్రకారం మాధవ రెడ్డి లకు కేటాయించాలని తీర్మానం చేసుకోవడం జరిగిందని తెలిపారు. 25 ఏళ్లుగా ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడుస్తూ ఆయన నాయకత్వంలో పని చేస్తున్నా నాయకులు సుధాకర్ గౌడ్, మాధవరెడ్డిలకు ఈ సారి తప్పకుండా టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఏ ఎన్నికలు వచ్చిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు మా కాలనీలు అండగా నిలుస్తున్నాయని ఈసారి ఎమ్మెల్యే ఆశీర్వదించి తమ బస్తి వారికే టికెట్ కేటాయించేలా కృషి చేయాలని కోరారు. సుధాకర్ గౌడ్, మాధవరెడ్డి లకు ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకొని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృష్ణ గౌడ్, మాధవరెడ్డి, సుధారర్ గౌడ్, కుమార్ యాదవ్, దత్తు, కరుణాకర్ గౌడ్, డా.కృష్ణ డా. మురళిజైపాల్, గణేష్ గౌడ్, నారాయణ, శివ, స్వామి గౌడ్, తిరుమల వెంకటేష్ గౌడ్, సురేష్ సాగర్, వెంకటేష్, శేఖర్, చిరంజీవి, ప్రభాకర్ గౌడ్, శ్రీనివాస్, గోపి, ఎల్లప్పు, యాదిరెడ్డి, బిమేష్ రెడ్డి, మన్నెంరెడ్డి, మల్లేష్, అంజయ్య. శ్రీకాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News