నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):*గన్నేరువరం మండలం లోని గునుకుల కొండాపూర్ గ్రామ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ ఉపసర్పంచ్ నాలపట్ల రాజు పాలకవర్గం బుధవారం రోజున కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను అయన నివాసంలో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని గ్రామపంచాయతీ నూతన భవనం మరియు మురికి కాలువ నిర్మాణం కోసం సిసి రోడ్లు గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలకవర్గం చొక్కల లక్ష్మయ్య చోక్కల సంగీత నాలపట్ల పరుశురాం బూట్ల శ్రీలత సుధ సుధా వోణి సాయి తేజ సొల్లు హరీష్. అనుమండ్ల పద్మ లింగంపల్లి రేణుక కొరివి నాగవ తదితరులు పాల్గొన్నారు.

