Thursday, March 5, 2026

*కొలువుదీరిన నూతన పాలకవర్గం..!* *- మానకొండూరు మండలంలోని అన్ని గ్రామాలలో ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గం..*

నేటి సాక్షి , మానకొండూర్: మానకొండూరు మండల పరిధిలోని 29 గ్రామాలలో నూతన పాలకవర్గం కొలువు తీరింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా గెలుపొందిన అభ్యర్థులు సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయా గ్రామల పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో పాలకవర్గ సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం పంచాయతీ కార్యదర్శి,గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు పాలకవర్గాన్ని శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ… గ్రామ అభివృద్ధి చేస్తామని గ్రామస్తుల సహకారంతో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తామని తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News