నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి: కోక్కుల వంశీ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని మానాల గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా గెలుపొందిన అభ్యర్థులు సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక అధికారి ఏంపీవో రాజేశ్వర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి బాబు ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బుర్ర శంకర్ గౌడ్, ఉపా సర్పంచ్ దాసరి అశోక్ లతో పాటు పాలకవర్గ సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీఓ నూతన సర్పంచ్, ఉపా సర్పంచ్ లకు బాధ్యతలు అప్పగించారు. ప్రమాణస్వీకారం అనంతరం ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి,గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు పాలకవర్గాన్ని శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ… గ్రామ అభివృద్ధి చేస్తామని గ్రామస్తుల సహకారంతో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తామని తెలియజేశారు.

