నేటి సాక్షి జూపాడుబంగ్లా డిసెంబర్ 24:–జూపాడు బంగ్లా మండలం భాస్కరపురం గ్రామంలో క్రిస్మస్ పండగ సందర్భంగా ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త జయసూర్య గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాస్థాయిలో క్రీడాకారులకు కబడ్డీ పోటీలు పెట్టడం చాలా సంతోషకరమని క్రీడలు మానసిక ఆందోళన దూరం చేస్తాయని అన్నారు. క్రిస్మస్ పండగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని అన్నారు.నేడు ఇక్కడ పోటీలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.. భాస్కరపురం గ్రామానికి కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేస్తానని రెండు సంవత్సరాల్లోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తానని వారన్నారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమేష్ బాబు, నీటి సంఘం సొసైటీ చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి,వ్యాయామ ఉపాధ్యాయుడు కొండపోగు చిన్న సుంకన్న, పగిడ్యాల మండల టీడీపీ అధ్యక్షులు పల్చాని మహేశ్వర్ రెడ్డి లింగాపురం నాగిరెడ్డి భాస్కరాపురం గ్రామ యువకులు రిపోర్ట్రర్ స్వామన్న,శ్రీనివాసులు, ఏసన్న, వీరస్వామి,శివచిన్నయ్య జూపాడు బంగ్లా మండల తహసిల్దార్ చంద్రశేఖర్ నాయక్,ఎంపీడీవో గోపికృష్ణ ఎస్సై కే మల్లికార్జున గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

