నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్న సీఎం కప్ క్రీడా పోటీలకు సంబంధించి సన్నాహక సమావేశం సోమవారం కోరుట్ల పట్టణంలోని మండల వనరుల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని పోటీల నిర్వహణపై చర్చించారు.*నాలుగు మండలాల నుంచి విద్యార్థుల పాల్గొనాలి*ఈ సందర్భంగా మండల విద్యాధికారి గంగుల నరేశం మాట్లాడుతూ, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల నుంచి నియోజకవర్గ స్థాయికి ఎంపికైన విద్యార్థినీ-విద్యార్థులు తప్పనిసరిగా పోటీల్లో పాల్గొనేలా వ్యాయామ ఉపాధ్యాయులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం పోటీలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు.*కోరుట్ల జూనియర్ కాలేజీ మైదానంలో పోటీలు*సీఎం కప్ క్రీడా పోటీలు కోరుట్ల జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 5న ఖో-ఖో, కబడ్డీ పోటీలు, ఫిబ్రవరి 6న వాలీబాల్, అథ్లెటిక్స్, ఫిబ్రవరి 7న చెస్, బ్యాడ్మింటన్, యోగా పోటీలు జరుగుతాయని వివరించారు.*శారీరక-మానసిక ఆరోగ్యానికి క్రీడలు అవసరం*విద్యార్థులు క్రీడల్లో పాల్గొని ప్రతిభను ప్రదర్శిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని గంగుల నరేశం పేర్కొన్నారు. క్రీడల వల్ల శారీరకంగా, మానసికంగా బలంగా మారడమే కాకుండా చదువులో కూడా చురుకుదనం పెరుగుతుందని అన్నారు.ఈ సమావేశంలో పీఈటీ సెక్రటరీ అశోక్‌తో పాటు విజయ్, మహిపాల్, శ్రీకాంత్, అజయ్, లక్ష్మణ్, దివ్య, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.______

