*. నేటి సాక్షి 22 డిసెంబర్ పాములపాడు:- పాములపాడు మండలంలో, సేవా భారతి యూత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గత 24 సంవత్సరాలుగా అనేక సమావేశ సేవా కార్యక్రమాలతో పాటు, ప్రత్యేకంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాలలో విరివిగా పాల్గొని, విజయవంతం చేయడానికి కృషి చేయడం జరిగిందని సంస్థ అధ్యక్షుడు- ఎస్.షర్ఫద్దీన్ అలీ తెలియజేశారు. ఈ సందర్భంగా సేవా భారతి (వై ఆర్ డి ఎస్) అధ్యక్షుడు- ఎస్.షర్ఫద్దీన్ అలి మాట్లాడుతూ 2002వ సంవత్సరం నుండి నేటి వరకు జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాల అవగాహన ర్యాలీలలో, ఏపీఎస్ఆర్టిసి బస్టాండ్ లో మా స్వచ్చంద సంస్థ కొరకు కేటాయించిన బూత్ నెంబర్-27లో ప్రయాణంలో ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరూ పోలియో వ్యాధి బారిన పడకుండా, ముందు జాగ్రత్తగా బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలలో ఎక్కే వారిని, దిగేవారిని గుర్తించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చేవారు, మరియు ఇక్కడి నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. మొత్తానికి దేశంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, స్వచ్ఛత సంస్థల ప్రతినిధులు, అంగన్వాడీ వర్కర్లు, ప్రభుత్వ అధికారులతో కలిసి దేశంలో పోలియో వ్యాధిని నిర్మూలించడానికి పోలియో వ్యాక్సిడేషన్ కార్యక్రమం అమలు చేస్తూ, విశేష కృషి చేయడం గర్వకారణం అన్నారు. ఈ 2025, డిసెంబర్-21,22,23 వ తేదీలలో నిర్వహించిన పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మాతోపాటు, పాములపాడు పీహెచ్సీ వైద్యాధికారిణి- ఈ.వి.నాగలక్ష్మి దేవి, డాక్టర్- ఎం.మహమ్మద్ బేక్, మండల స్పెషల్ ఆఫీసర్ ఎం.ఎన్.వి.రాజు, ఎంపీడీవో- ఎన్.చంద్రశేఖర్, హెల్త్ ఎడ్యుకేటర్ జి.మల్లికార్జున, ఎంపీహెచ్ఏ (మేల్)-డి.రామ్ నాయక్, ఎంపిహెచ్ఎస్ (మేల్) ఏం.మద్దయ్య, ఫార్మసిస్ట్- ఎస్.మూస సలాం, సిహెచ్ఓ-అన్నమ్మ, మద్దూరు సిహెచ్ఓ- కే.రేణుకా దేవి, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్-లింగాల.నాగరాజు, భూ రీసర్వే డిటి- వి.సుప్రియా, ఎంఎన్ఓ లు-సి.హరికృష్ణ, ఎన్.శాలు, ఎస్ఎడబ్ల్యూ-ఎన్.పుల్లయ్య, వీఆర్వో- వై.శివన్న, తుమ్మలూరు గ్రామ సర్పంచ్ వి.ప్రసాద రావు, పాములపాడు గ్రామ సర్పంచ్- మేకల.భాగ్యమ్మ, టిడిపి నాయకులు తిమ్మారెడ్డి, ఎం.రాజశేఖర్, డీలర్ నాగభూషణం, తదితర వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు పిల్లలకు పోలియో చుక్కలు వేసి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది.





