నేటి సాక్షి,నారాయణపేట,డిసెంబర్ 24, నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం లోని గుడిగండ్ల గ్రామం నుండి మంత్రోని పల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు పనులను చేపట్టాలని గ్రామస్తులు కట్టప్ప, తిమ్మయ్య, మంత్రి వాకిటి శ్రీహరిని, కోరారు. బుధవారం స్థానిక విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గుడిగండ్ల గ్రామం నుండి మా గ్రామానికి రహదారి వేయడం పట్ల సౌకర్యంగా ఉంటుందని వారు అధికారుల ను కోరారు. హైదరాబాద్, మహబూబ్నగర్, రాయచూర్, నుండి వచ్చే ప్రజలకు రాత్రి సమయంలో గ్రామానికి వచ్చే గ్రామస్తులకు గుడిగండ్ల గ్రామం నుండి మంత్రోనిపల్లి గ్రామం వరకు వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంటుందని వారు వివరించారు. రాష్ట్ర మంత్రివర్యులు స్పందించి బిటిరోడ్డు పనులను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరారు .ఈ సమావేశంలో సి. రమేష్ ,అంజప్ప ,తదితరులు పాల్గొన్నారు.

