నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 26 ~అన్నమయ్య జిల్లా :-: తిరుపతి జిల్లా లోని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నయా దందాకు వైద్యులు తెర లేపారు. ప్రభుత్వమిచ్చే జీతాలు సరిపోలేదని సైడ్ బిజినెస్ మొదలు పెట్టారు. దీంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. రీ – వెరిఫికేషన్ పేరిట వసూళ్లకు తెర లేపారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చాలా ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు గూడూరు ఆసుపత్రిలో రీ వెరిఫికేషన్ కోసం వచ్చి పడిగాపులు కాస్తున్నారు. డాక్టర్ రూములోకి వెళ్లడమే తరువాయి ఒక్కొక్కరి వద్ద రూ.50లు వసూళ్లు చేస్తున్నారు. చేతిలో నగదు పెడితేనే వైకల్యం ఉన్నట్లు సర్టిఫికేట్ ఇస్తున్నారని వికలాంగుల ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. పెన్షన్ కావాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. దీంతో వైద్యులు నయా దందాకు తెర లేపారు. పెన్షన్ రావాలంటే ఆ సర్టిఫికెట్ కానే కావాలి. లేకపోతే పెన్షన్ రాదు. దీంతో చాలా మంది డబ్బులిచ్చి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆఖరికి వికలాంగులను కూడా వదలట్లేదని ఏ పని చేయాలన్నా ఎటువంటి ఆసరాలేని వారికి కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్వాకంతో ఇబ్బందులు తప్పేలా లేదు. ఓ పక్క పెన్షన్ కావాలంటే తప్పనిసరి రీ వెరిఫికేషన్ సర్టిఫికెట్ కావాలని ఆదేశాలు. మరో వైపేమో రీ వెరిఫికేషన్ సర్టిఫికెట్ కావాలంటే చేతులు తడిపితేనే మంజూరు చేస్తున్న పరిస్థితి.~~~~~~~~~~~~~~~~~~

