Friday, February 13, 2026

*చెలిమిళ్ళ కబడ్డీ పోటీలలో గెలుపొందిన మొదటి విజేత టీంకు 35వేల రూపాయలు బహుమతి ప్రధానం చేసిన ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్:— వేల్పుల ఆనంద్ కుమార్*.

నేటి సాక్షి 26 డిసెంబర్ పాములపాడు:- పాములపాడు మండలంలోని, చెలిమిళ్ళ గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా సిఎస్ఐ సంఘం ఏర్పాటుచేసిన కబడ్డీ పోటీలను ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ వేల్పుల ఆనంద్ కుమార్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మద్దూరు గ్రామంలో షాప్ ను కూడా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. అక్కడ కూడా ఆయనకు మెడలో పూలమాలవేసి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ వేల్పుల ఆనంద్ కుమార్ కు ఎద్దుల బండిమీద మేల తాళాలతో ఊరేగింపుతో కార్యక్రమానికి తీసుకొని వెళ్లడం జరిగింది. ఆయన అనంతరం కబడ్డీ టీమ్ సభ్యులను షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ కబడ్డీ పోటీలలో 36 టీములు పాల్గొనగా, అందులో ఫైనల్ గా గెలుపొందిన మొదటి విజేత టీంకు అసిస్టెంట్ కమిషనర్ వేల్పుల ఆనంద్ కుమార్ మొదటి బహుమతి నగదు 35,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గెలుపొందున ఇతర విజేతలకు రెండవ బహుమతి సంఘ పెద్దలు 25వేల రూపాయలు, డి.పెద్ద పుల్లయ్య మూడవ బహుమతి 15వేలు, నాలుగో బహుమతి వి.ప్రాచీస్, నడిపిన నారాయణ-10వేలు, ఐదో బహుమతి గణముల బ్రదర్స్-5 వేలు, ఆరవ బహుమతి సిఎస్ఐ సంఘం-3 వేల రూపాయల ప్రకారము ఇవ్వడం జరిగింది. ఈ పోటీలలో పాల్గొన్న వాళ్ళందరికీ, ప్రజలకు గ్రామ సర్పంచ్ కోట్ల.చద్రారెడ్డి భోజన వసతిసదుపాయాలు కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ వేల్పుల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో పండుగ పూట ఇటువంటి పోటీలు ఏర్పాటు చేయడం వలన అందరికీ ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పుల సైన్యం బిసి ఐక్య సంఘం అధ్యక్షుడు గట్టు.శంకర్ గౌడ్, జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల.సంజీవరాయుడు, ఆర్.ఎల్ల గౌడ్, మింగి.శ్రీనివాసులు, మేకల సుధాకర్ , చాకలి శివుడు, వెంకటేశ్వర్లు గౌడ్, వెంకటరమణ, రాము గౌడ్ వేల్పుల రాజు, కిట్టు, సత్యరాజ్, వినోద్ కుమార్, స్వామిదాసు, అభిమానులు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News