Tuesday, February 17, 2026

*జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం..**కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదు…**బి ఆర్ ఎస్ ప్రతిపక్షంగా రాష్ట్రవ్యాప్తంగా ఘోరంగా విఫలమైంది..**జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో..? ఆ విషయంలో కోర్టుకు కూడా స్పష్టత ఉండదు**కేటీఆర్ పై డ్రగ్స్ తీసుకున్నాడని కాదు డ్రగ్స్ సరఫరా చేశాడనే కేసు కూడా నమోదు చేయాలి..**పార్లమెంట్ పరిధిలో ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్ మరియు అన్ని మున్సిపాలిటీలు గెలుస్తాం… అరవింద్*

నేటి సాక్షి – జగిత్యాల (ఇమ్మడి విజయ్ కుమార్ ) : జగిత్యాల పట్టణంలోని పి ఎం ఆర్ గార్డెన్ లో శుక్రవారం నిజామాబాద్ ఎం. పి. అరవింద్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ..ప్రతి మున్సిపాలిటీ కి జిల్ల స్థాయి లో ఐదుగురు ఇన్చార్జి ల నియామకం చేశామని అన్నారు. ప్రతిపక్ష పార్టీగా బి ఆర్ ఎస్ పార్టీ విఫలమైందని.అది మనం వినియోగించుకోవాలని కార్యకర్తలకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు.కేటీఆర్ పై డ్రగ్స్ తీసుకొన్నాడు అనే కాదు డ్రగ్స్ సరఫరా చేశాడు అనే కేసు కూడా పెట్టాలని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీ లో ఉన్నారో ఎవరికి అంతు చిక్కడం లేదని ఏద్దేవా చేసారు. ఆయన విషయంలో కోర్టు కూడా ఆలోచన లో పడేవిధంగా ఉందని అన్నారు.జగిత్యాల ఎమ్మెల్యే నన్ను కేవలం నియోజకవర్గ అభివృద్ధి విషయం లో మాత్రమే కలిశారని అందులో ఎలాంటి ఊహాత్మకతాకు తావు లేదని, కాంగ్రెస్ సి ఎం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నీ కూల్చిన బి ఆర్ ఎస్ జెండా గద్దెలు కూల్చివేయండి అనటంతో ఆయన ఏ పార్టీ వారో తెలియక నల్గొండ కాంగ్రెస్ నాయకులు అయోమయం లో ఉన్నారన్నారు. జీవన్ రెడ్డి నీ కాంగ్రెస్ ఇబ్బందులకు గురిచేయడం సరికాదు జగిత్యాల లో విచిత్ర రాజకీయం నడుస్తుందని. ఎవరికి అర్థం కావటం లేదని. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కార్పొరేషన్ తో పాటు అన్ని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News