Thursday, March 5, 2026

*జాతీయస్థాయి పోటీలకు ధర్మారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు*

నేటి సాక్షి, ధర్మారం (జనవరి 28): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల & కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు వి. అఖిల, బి. శ్రీజ 69వ ఎస్‌.జి‌.ఎఫ్ అండర్–19 జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్‌కుమార్ తెలిపారు.గత సంవత్సరం డిసెంబర్ లో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో వీరు ఉత్తమ ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ జట్టుకు ఎంపికయ్యారని పేర్కొన్నారు.ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం గుమార్విన్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు తరపున పాల్గొననున్నారని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్‌కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు బైకాని కొమురయ్య, మేకల సంజీవరావు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News