నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*చిత్తూరు :* జీడి నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో 96 ఏళ్ల నాటి అతి పురాతనమైన సిఎస్ఐ చర్చ్ నేటికీ చెక్కుచెదరకుండా ఉందంటే.. నమ్మండి, రండి, దర్శించండి. బ్రిటిష్ వారి పాలన కాలంలో 1929 సం.లో సీ.ఆర్ వీరంగ దొరై అనే దేవుని పరిచర్యకుల చేత ఇది నిర్మింపబడింది. ఈయన తమిళనాడు రాష్ట్రం, చిత్తూరు జిల్లాకు సరిహద్దు ప్రాంతమైన వేలూరు సీఎంసీ ఆసుపత్రి నిర్వాహకురాలు డా. ఐడా స్కడ్డర్ సోఫియా వారి వారసులు. వేలూరులోని సీఎంసీ ఆసుపత్రి, ఊరిస్ కాలేజ్, దక్షిణ భారత దేశంలో అనేక సేవా కార్యక్రమాలకు వీరే.. నాంది. అలాంటి జీడి నెల్లూరు సంఘం వారి చేత ఏర్పాటైన ఆత్మకూరు సంఘం నుండి జీడి నెల్లూరు వేరు చేయబడిన అనంతరం ఈ చర్చ్ నిర్మాణమైంది.దక్షిణ భారతదేశంలో అతి పురాతనమైన చారిత్రాత్మకమైన 125 ఏళ్ల నాటి సీఎంసీ ఆసుపత్రి, ఎంతోమంది ప్రపంచాన్ని తలకుందులు చేసిన మేధావులకు జ్ఞానాన్ని అందించిన ఊరిస్ కాలేజ్, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిచర్యకు 150 ఏళ్ల నాటి చారిత్రాత్మకమైన సీఎస్ఐ వేలూరు డయాసిస్ చర్చ్ పవిత్ర స్థలం నుండి ఉపదేశకుల స్థితి నుండి రెవరెండ్ లుగా, బిషప్ దక్షిణ భారతదేశ పీఠాధిపతి స్థాయి వరకు ఎదగడానికి ఆజ్యం పోసింది, గ్రామీణ ప్రజలలో ఉన్న అజ్ఞానాన్ని, మూఢనమ్మకాలను పారద్రోలి సమాజంలో జ్ఞానాన్ని బోధించి అనారోగ్యానికి ముందస్తు జాగ్రత్తలతో కూడిన చర్యలు చేపట్టడానికి ఆసుపత్రులు, అనేక రకమైన విద్యా బోధనల పాఠశాలలు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి, అంతర్జాతీయ రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసింది.. డా. ఐడా స్కడ్డర్ సోఫియా కుటుంబ సభ్యులే. వీరి 3వ తరంలో ఉన్న మనవరాళ్ళు.. మనవాళ్లు జీడి నెల్లూరు మండలంలోని నెల్లేపల్లి సంఘంలో నూతనంగా నిర్మించిన సీఎస్ఐ చర్చి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొనడం విశేషం. అలాంటి వీరి దేవుని పరిచర్యలు, సేవా కార్యక్రమాలు నేటికీ మన కంటికి సాక్షాలుగా మిగిలిందంటే వారి కఠోర శారీరక శ్రమ, వారు దేవునికి సమర్పించుకున్న సమర్పణలే… నేటికీ మిగిలిన మన ప్రత్యక్ష సాక్షాలు. ఈ క్రిస్ట్ మస్ వేడుకల సందర్భంగా జీడి నెల్లూరుకు ఇంతటి ఘన చరిత్ర కలగడానికి కారకులైన సీఎస్ఐ చర్చి నిర్వాహకులు డా. ఐడా స్కడ్డర్ సోఫియా వారి వారసులైన సీ.ఆర్ వీరంగ దొరై కుటుంబం దేవుని ఆశీర్వాదకరమైన హస్తాలతో దీవింపబడాలని మనమందరం వారి కుటుంబాన్ని ఒక్కసారి సుమరించుకుందాం. ప్రార్థిద్దాం.. దేవుని పేరిట ఆశీర్వచనాలు పలుకుదాం.ఇది కృతజ్ఞతా భావంతో కూడిన మనందరి బాధ్యత.




