నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*వెదురుకుప్పం,* డిసెంబర్ 26, డా. వై.ఎస్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వెదురుకుప్పంలో డిసెంబర్ 26, 2025న వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో దేశభక్తి భావాలతో నిర్వహించారు. యువ వీరుల త్యాగాలు, ధైర్యసాహసాలను స్మరించుకుంటూ విద్యార్థుల్లో దేశభక్తి, ధైర్యం, నైతిక విలువలను పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.కార్యక్రమంలో కళాశాల ఉపప్రిన్సిపాల్ డా. బి.ఎల్. ప్రసన్నలత వీర్ బాల్ దివస్ ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులు ధైర్యం, క్రమశిక్షణ, దేశసేవా భావనలను అలవరచుకోవాలని సూచించారు. డబ్ల్యూ ఈసి సమన్వయకర్త డా. ఎస్. రుష్మా* యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని, వీర బాలల జీవితాల నుంచి స్ఫూర్తి పొందాలని విద్యార్థులను ప్రోత్సహించారు. కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డా.ఎ సి భరణినాథ్ రెడ్డిశారీరక దృఢత్వం, మానసిక బలం, క్రమశిక్షణ ప్రాముఖ్యతపై ప్రసంగించారు.కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు ఎం. ఇస్మాయిల్ డిజిటల్ యుగంలో విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని వివరించారు.ఈ సందర్భంగా డబ్ల్యూ ఈసి ఆధ్వర్యంలో నినాద రచన, ఫిట్‌నెస్ కార్యక్రమాలు, గ్రూప్ డిస్కషన్ తదితర పోటీలు నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.కార్యక్రమం చివరలో విద్యార్థులు వీర బాలల ఆదర్శాలను తమ జీవితాల్లో అనుసరించాలని సంకల్పం చేసుకోవడంతో ఈ వేడుక విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపక అధ్యాపకేత్ర బృందం పాల్గొన్నారు

