Thursday, March 12, 2026

*దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించి.. ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే యూత్ ఫోర్ జాబ్స్ ఫౌండేషన్ లక్ష్యం..**

నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):*దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించి.. ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే యూత్ ఫోర్ జాబ్స్ ఫౌండేషన్ లక్ష్యంగా పనిచేస్తుందని యూత్ ఫోర్ ఫౌండేషన్ తెలంగాణ అసిస్టెంట్ మేనేజర్ మహమ్మద్ షాహిద్ పేర్కొన్నారు. బుధవారం గన్నేరువరం మండల కేంద్రంలోని యూత్ ఫోర్ ఫౌండేషన్ ఉచిత శిక్షణ సెంటర్ లో దివ్యాంగులకు స్వయం ఉపాధి పెంపొందినందుకు యూత్ ఫోర్ జాబ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కోర్సులలో నెలరోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న దివ్యాంగులకు కుట్టు మిషన్, జిరాక్స్ మిషన్, వెజిటేబుల్ కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ షాహిద్ మాట్లాడుతూ.. ‘కరీంనగర్ జిల్లాలోని ఎనమిది మండలాలలో దివ్యాంగులకు ఉచితంగా కిట్లను పంపిణీ చేశామన్నారు . దివ్యాంగులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా వారికి ప్రత్యేక శిక్షణను అందించి, స్వయం ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ఇంచార్జ్ మోరే కృష్ణ, ప్రతిభ, కోఆర్డినేటర్ పాశం ఎల్లయ్య, ట్రైనర్ శివరాత్రి శారద, కొలుపుల మహేందర్ , దివ్యాంగులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News