Friday, May 15, 2026

*దోమ మండల అధ్యక్షున్ని కి శుభాకాంక్షలు తెలిపిన బొంపల్లి అంతిరెడ్డి.*

నేటి సాక్షి, దోమ (సురేష్ మోత్కూర్.) బొంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతి రెడ్డి నూతనంగా ఎన్నుకోబడిన దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దొరశెట్టి శాంత కుమార్ ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అంకిరెడ్డి మాట్లాడుతూ…. దోమ మండలంలో అధ్యక్ష పదవి నీకు రావడం చాలా సంతోషం ఇతర పార్టీలనుంచి కూడా నాయకులకు ఆహ్వానం పలుకుతూ, కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకొని పార్టీని మరింత బలోపేతం చేయాలని సలహాలు ఇచ్చారు. పార్టీ అన్నాక సీనియర్లు, జూనియర్లు అనే భావన ఉంటుంది. వాటన్నిటిని పక్కనపెట్టి పార్టీ కోసం పనిచేయాలని ప్రత్యేకంగా తెలిపారు. పరిగి నియోజకవర్గంలోని దోమ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం పెంచాలని దోమ మండలానికి ప్రత్యేక గుర్తింపు తేవాలని సూచించారు. దోమ మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో కాంగ్రెస్ను మరింత పటిష్టం చేయడానికి నిరంతరం కృషి చేయాలని తెలిపారు. సమాజంలో వ్యక్తులకు గెలుపోటములు సహజం అని గెలిచిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఓడిన వాళ్లను మరింత ఎక్కువగా ఎంకరేజ్ చేసి పార్టీని ముందుకు నడిపించాలని సూచించారు. పార్టీ అన్నాక ఒడిదుడుకులు సహజం అన్నిటిని తట్టుకునే శక్తి, అందర్నీ కలుపుకపోయే తత్వం అధ్యక్షునికి ఉండాలని సూచించారు.మరి ముఖ్యంగా అధ్యక్షునికి ఓపిక సహనం పట్టుదల మూడు ముఖ్యమని తెలిపారు. అధ్యక్ష పదవిగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి మీరు నమ్మకంగా పనిచేయాలని ప్రత్యేకంగా సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గూడూరు యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News