నేటి సాక్షి,నారాయణపేట,జనవరి 22 (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని ధన్వాడ ఎమ్మార్వో కార్యాలయం దగ్గర గురువారం మండల నూతనంగా డీలర్ మండల అధ్యక్షులుగా వెంకట లక్ష్మమ్మ ఉపాధ్యక్షుడిగా నారాయణ నాయక్ ప్రధాన కార్యదర్శిగా బాలప్ప మరియు యాదయ్య సభ్యులుగా సకీరప్ప రాజు నాయక్ డీలర్ బాబా అమృత పాత పల్లి గోపాల్ తదితరులు కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. అనంతరం అధ్యక్షులు ఉపాధ్యక్షులకు గణ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ధన్వాడ మండల తాసిల్దార్ సింధుజకు శాలువాలతో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా తమ డిమాండ్ల వినతి పత్రాన్ని ధన్వాడ మండల తాసిల్దార్ సింధుజను డీలర్ల ఆధ్వర్యంలో అందజేయడం. మండల తాసిల్దార్ సింధుజ మాట్లాడుతూ ఇట్టి విషయంపై నారాయణపేట జిల్లా కలెక్టర్ విన్నవిస్తామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన డీలర్లు ధన్వాడ బాబా డీలర్, శివారెడ్డి, చక్కెరప్ప, యాదయ్య, పెదరాయుడు, సుధాకర్ శెట్టి, రాజు నాయక్, బాలయ్య,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

