నేటి సాక్షి, తిమ్మాపూర్:కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సర్పంచుగా తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాసరావు గత సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, సర్పంచ్ దంపతులను ఆశీర్వదించారు. మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ వేడుకలో పాల్గొని, సర్పంచును శాలువాతో సత్కరించి.. శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు సెక్రెటరీ సమక్షంలో ఆమె ప్రమాణం చేసి, పదవీ బాధ్యతలు స్వీకరించారు. *జిల్లాలోనే భారీ మెజార్టీతో..* కరీంనగర్ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై దాదాపు 950ఓట్ల భారీ మెజార్టీని వారు సొంతం చేసుకున్నారు. కాగా సోమవారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి తనపై ఓటమి పాలైన వ్యక్తిని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించి, వారి మంచి మనసును చాటుకున్నారు. *గ్రామాభివృద్ధిలో ‘తుమ్మనపల్లి’ది కీలకపాత్ర..* ప్రస్తుత సర్పంచ్ భర్త గతంలో గ్రామ సర్పంచుగా పనిచేస్తూ తుమ్మనపల్లి శ్రీనివాసరావు కీలకంగా వ్యవహరించారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఊరిని అభివృద్ధి పథంలో నడిపారు. గ్రామంలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే కాకుండా, ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలిచారు. కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసుకున్నారు. ఆయన సర్పంచుగా ఉన్న పదవీకాలంలో నుస్తులాపూర్ గ్రామానికి చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డు రాగా, ఆయన తదనంతరం ఎన్నికైన సర్పంచ్ ఆ అవార్డును అందుకున్నారు.

