Tuesday, February 17, 2026

పరిష్కరించుకుంటే పాలకమండలి సమావేశాన్ని ముట్టడి చేస్తాం………. నిరసన దీక్ష నేటికి 493 రోజులు……

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించాలని తక్షణమే లైసెన్స్ ఇవ్వాలని గత 493 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నారు. ఆ సమస్యను పరిష్కరించాలని ఈరోజు తిరుమల తిరుపతి పరిపాలన భవనం ఎదురుగా నిరసన చేయడం జరిగింది. ఈ నిరసన ను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఎస్ జయచంద్ర టి. సుబ్రహ్మణ్యం…….మాట్లాడుతూ శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తులు లైసెన్స్ ఇవ్వాలని ఇవ్వాలని గత 493 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్న ప్రభుత్వం టిటిడి పాలకమండలి పట్టించుకోవడం లేదు. అనేకసార్లు అధికారుల చుట్టూ విన్నతులు చేసిన ఏమాత్రం పట్టించుకోకుండా పెడుతున్నారు. 30 కుటుంబాలు అన్నమో రామచంద్రాన్ని ఆకలితో అలమటిస్తున్నారు. వారి కుటుంబాలన్నీ వీధిన పడినాయి. బిడ్డల చదువు లాగిపోయినాయి. కనికరించాల్సిన పాలకులు వారి చెవులకు, కనులకు నిరసన దీక్ష కనపడలేదని ప్రశ్నించారు. వర్షాల సైతం లెక్కచేయకుండా, చలికి వణుకుతూ, ఎండకి ఎండుతూ నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. అయినా టిటిడి పాలకమండలికి కనీసం పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు విన్నపించిన పెడుతున్నది టిటిడి యాజమాన్యం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించుకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో శ్రీవారి మెట్లు యూనియన్ నాయకులు, మధు యుగంధర్, చిరంజీవి ప్రకాష్,చిన్నంపెంచలయ్య రామ్మూర్తి,మల్లికార్జున,గోపి రాంబాబు, గణేష్,సోను తదితరులు పాల్గొన్నారు……

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News