Saturday, February 14, 2026

పాలిటివ్ కేర్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి స్వర్ణకుమారి.

నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి స్వర్ణకుమారి అనంతగిరిలోని పాలీటివ్ కేర్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అక్కడి సిబ్బందితో మాట్లాడుతూ పాలీటివ్ కేర్ సెంటర్ ను 24 గంటలు పని చేసే విధంగా చూడాలని సిబ్బంది షిఫ్టుల ప్రకారం విధులు నిర్వహించాలని, ఇక్కడికి వచ్చే రోగులకు అవుట్ పేషెంట్ సేవలే కాక ఇన్ పేషంట్ సేవలను కూడా అందించాలని అవసరమైన వారిని అడ్మిషన్ చేసుకుని సేవలు అందించాలని ఆదేశించారు. పాలియేటివ్ కేర్ సెంటర్లో అందుబాటులో ఉన్న పడకలను క్రమ పద్ధతిలో అమర్చుకొని రోగులకు సౌకర్యవంతంగా ఉండేవిధంగా వైద్య సేవలు అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్యులు, స్టాఫ్ నర్స్ లు సిబ్బందికి 851 మందికి హెపటైటిస్ బి వాక్సినేషన్ చేయడం జరిగినదని తెలిపారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు డిప్యూటీ డెమో వి శ్రీనివాసులు, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సత్యం, ఇన్ సిడి కోఆర్డినేటర్ జయరాములు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News