నేటి సాక్షి, నారాయణపేట, డిసెంబర్ 26, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో ప్రతి వార్డులలో పారిశుద్ధ్య పనులు శుభ్రంగా ఉండాలని మరికల్ గ్రామ సర్పంచ్ గుప చెన్నయ్య అన్నారు. మరికల్ గ్రామంలోని పలు వార్డు లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులలో చెత్తాచెదారాన్ని తొలగించే ఏర్పాట్లు సిబ్బంది చూసుకోవాలన్నారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. సర్పంచ్ వెంట గ్రామ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




