Saturday, February 14, 2026

*బక్కూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన ఆటో డ్రైవర్.*

*నేటి సాక్షి-మేడిపల్లి* ఆదర్శంగా నిలిచిన ఆటో డ్రైవర్ ముద్రకోల నరేష్ కథలాపూర్ మండలం తక్కలపెల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు అత్యవసర సమయంలో రక్తం అవసరమని వైద్యులు సూచించగా, కుటుంబ సభ్యులు బక్కూరి ఫౌండేషన్ చైర్మన్ నరేష్ సంప్రదించారు. భీమారం మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ ముద్రకోల నరేష్,బక్కురి ఫౌండేషన్ చైర్మన్ నరేష్, సూచన మేరకు ముందుకొచ్చి రక్తదానం చేసి మానవతాసేవకు నిదర్శనంగా నిలిచాడు. సమయానికి రక్తం అందడంతో మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ సందర్భంగా రక్తదానం చేసిన ఆటో డ్రైవర్ ముద్రకోల నరేష్, ను బక్కూరి ఫౌండేషన్ చైర్మన్ నరేష్, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ఆసుపత్రి సిబ్బందిని అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పలువురు పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News