Friday, February 13, 2026

*బీఆర్ఎస్ లీగల్ సెల్ చీఫ్ కన్వీనర్‌గా బైరి విజయ్ నియామకం** కోరుట్ల పట్టణ–మండల కో-కన్వీనర్లకు నియామక పత్రాలు అందజేత*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కోరుట్ల పట్టణ, మండల లీగల్ సెల్ చీఫ్ కన్వీనర్‌గా బైరి విజయ్ కుమార్‌ను నియమించినట్లు బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలిపారు. బుధవారం కోరుట్లలో జరిగిన కార్యక్రమంలో లీగల్ సెల్ కన్వీనర్‌, కో-కన్వీనర్ల నియామకాలను ఆయన అధికారికంగా ప్రకటించి నియామక పత్రాలను అందజేశారు.*కో-కన్వీనర్లుగా పలువురికి బాధ్యతలు*ఈ సందర్భంగా కోరుట్ల పట్టణ, మండల బీఆర్ఎస్ లీగల్ సెల్ కో-కన్వీనర్లుగా సుతారి నవీన్ కుమార్, వనపర్తి క్రాంతికుమార్, వేముల నాగరాజు, కటుకం రాజేష్, ఊరడి నరేందర్, రాస గౌతమ్, అల్వాల వినయ్ కుమార్, సదుల మాధురి, ఓటారికారి రంజిత, గట్ల సృజన్ కుమార్‌లను నియమిస్తూ వారికి బాధ్యతలు అప్పగించారు. పార్టీ న్యాయపరమైన వ్యవహారాల్లో లీగల్ సెల్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని జిల్లా అధ్యక్షుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు.*నూతన బాధ్యతలపై హర్షం*ఈ నియామకాల పట్ల కోరుట్ల మండల బీఆర్ఎస్ అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, సింగిరెడ్డి నారాయణ రెడ్డి, కోరుట్ల పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి గుడ్ల మనోహర్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ నూతన లీగల్ సెల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా నియమితులైన చీఫ్ కన్వీనర్, కో-కన్వీనర్లు పార్టీ న్యాయపరమైన కార్యకలాపాలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.—–

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News