నేటి సాక్షిమంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండల పరిధిలో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ బ్యాక్ వాటర్ కారణంగా ముంపుకు గురయ్యే భూముల సేకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల రాజస్వ మండల అధికారి కార్యాలయంలో ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు తో కలిసి భూసేకరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ బ్యాక్ వాటర్ కారణంగా జిల్లాలోని కోటపల్లి మండల పరిధిలో గల దేవులవాడ, అర్జునగుట్ట, రావులపల్లి, రాపనపల్లి గ్రామాల భూములు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో భూసేకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. అర్హులైన రైతులకు నష్టపరిహారం అందించడంలో భాగంగా భూసేకరణ సక్రమంగా నిర్వహించాలని, ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

