నేటి సాక్షి. చిలుకూరు.. చిలుకూరు కర్ల రాజేష్ మృతికి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోదాడలో నిర్వహించిన ర్యాలీలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చిలుకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులురాస్తారోకో నిర్వహించి రాస్తారోకో నిర్వహించి మల్లయ్య యాదవ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గీతా వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడవల్లి పుల్లారావు ప్రధాన కార్యదర్శి పిండాది హనుమంతరావు మాట్లాడుతూ కోదాడ హుజూర్నగర్ ని అభివృద్ధి చేస్తున్న నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దిగజారుడు రాజకీయమని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లు వట్టికూటి నాగయ్య, బాదే లింగయ్య కొల్లు పుల్లమ్మ నాగయ్య నాయకులు వనపర్తి రామారావు, గరినే శేషగిరి, పులగం లక్ష్మీనారాయణ అలుసు కాని వెంకటయ్య గంగిరెడ్డి నాగిరెడ్డి , సొంద్ మియా, అమృనాయక్ కృష్ణ దొంతగాని నరసింహారావు పొందూరు రమేష్ కొండ నరేష్ వివిధ గ్రామాల నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

