నేటి సాక్షి, నారాయణపేట, డిసెంబర్ 23, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని మంది పల్లి గ్రామ సర్పంచ్ గా సురేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా మంది పల్లి గ్రామ ఉపసర్పంచ్ నరేష్ ని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ నుండి ఎన్నుకోవడం జరిగింది. గ్రామస్తుల ఆధ్వర్యంలో శాలువలతో పూలమాలతో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా గ్రామపంచాయతీ మిగతా వార్డు సభ్యులు అధికారుల ద్వారా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మందపల్లి గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు , మహిళలు యువజన సంఘాల నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

