నేటి సాక్షి, నారాయణపేట,మే 4,(రిపోర్టర్ ఇమామ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బెంగాల్ అస్సాం పుధిచ్చేడు రాష్ట్రాలలో బిజెపి అధికారంలోకి రావడంతో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో వాన సంచాలు కాల్చే కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు నరసంగౌడు హాజరయ్యారు. అనంతరం ఎలిగండ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు ఆంజనేయులు గ్రామ సర్పంచ్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మరికల్ మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ కార్యకర్తలు రాజేష్ వడ్డే శ్రీరామ్, సత్యనారాయణ స్వామి శెట్టి అశోక్ రమేష్ తిరుపతయ్య, బీమ్ గౌడు, నరేష్, ఊసు రవి కుమార్ మహేష్ కుమార్ వడ్డే శివ చెన్నయ్య, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





