నేటిసాక్షి : జగదేవపూర్డిసెంబర్ 25 తెలంగాణ ఉద్యమ నేత మాజీ సీఎం కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని తెలంగాణ రాకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా అని సీఎం రేవంత్ రెడ్డికి మాటలు తప్ప చేతలు లేవు అని మండల బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాచారం కనకయ్య అన్నారు.గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన తండ్రి వయసున్న కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి అనుచిత విమర్శలు దూషణలు చేస్తూ మాట్లాడొచ్చా అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు,ఒక స్టేట్స్మెన్లా కేసీఆర్ మాట్లాడితే…..ఒక విధీ రౌడీలాగా రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నడు అని చెప్పారు.నీకు దమ్ము ఉంటే కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు అని రేవంత్ రెడ్డి నీ అని ఆయన పేర్కొన్నారు.కేసీఆర్ దీక్షా ఫలితం, అమరుల త్యాగాలతో నే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని అన్నారు. ‘29 నవంబర్ 2009 చరిత్ర మలుపు తిప్పిన రోజు.. చారిత్రాత్మక రోజు.. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు.. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు. జూన్ 2 లేకపోతే తెలంగాణ ఎకడిది రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఎకడిది.. తెలంగాణ వచ్చింది కాబట్టే ఈరోజు మీరు ఆ పదవిలో ఉన్నారని మర్చిపోయి మాట్లాడుతున్నారన్నారు. కృష్ణా గోదావరి నది జలాలపైన, రాష్ట్ర సమస్యలపైన కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దూషణలకు దిగడం సిగ్గుచేటన్నారు. నగర కాలుష్య నివారణకు కేసీఆర్ ఫార్మాసిటీ భూసేకరణ చేస్తే.. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అక్కడికి వెళ్లి ఫార్మా సిటీ వద్దని చెప్పి..రైతులకు భూములు వాపస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాడన్నారు. ఇప్పడు రైతుల భూములు వాపసు ఇవ్వకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని.. దీనిని కేసీఆర్ ప్రశ్నించారన్నారు.గురుకులాలకు నాణ్యమైన భోజనం పెట్టే దిక్కులేదని, నాలుగు నెలల నుంచి కాస్మోటిక్స్, మెస్ బిల్లులు లేవన్నారు. గ్రీన్ చానల్ ద్వారా బిల్లులు విడుదల చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు ఎక్కడ పోయాయన్నారు. విద్యార్థులకు సరిగ్గా భోజనం పెట్టని రేవంత్ రెడ్డిని చెట్టుకు కట్టేసి నీ లాగులో తొండలు జొరగొట్టాలని అన్న తక్కువేనన్నారు. పిల్లల బిల్లులకు కమిషన్లు రావనే బిల్లులు ఇవ్వడం చేతకాని దద్దమ్మవు నువ్వు అని విమర్శించారు. విద్యాశాఖ మంత్రిగా, ఫెయిల్యూర్ సీఎంగా నువ్వే దీనికి బాధ్యత వహించాలన్నారు.కొడంగల్ లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి గతంలో రేవంత్ రెడ్డి మాట తప్పాడని, ఆయను పార్టీలు మారుడు, శపథాలు చేసి తప్పుడు అలవాటేనని ఎద్దేవా చేశారు.





