*నేటి సాక్షి* తిరుమలాయపాలెం ఫిబ్రవరి 03 మెట్టు రుద్రరాజుఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామంలో మూడు హరి సింగ్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు ఇతను ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ఇన్సూరెన్స్ కట్టడం ద్వారా తన కుటుంబానికి రెండు లక్షల రూపాయలు చెక్కును నామిని అయినటువంటి తన భార్య మూడు ఉమా కు సుబ్లేడ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో బ్రాంచ్ మేనేజర్ చేతులు మీదుగా చెక్కును అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ షేక్ మున్న మాట్లాడుతూ ఇన్సూరెన్స్ పాలసీల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఇన్సూరెన్స్ కట్టుకోవాలని అలాగే మనం కట్టే ఇన్సూరెన్స్ మన కుటుంబాలకు ఆర్థిక ఆసరాగా ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ షేక్ మున్న, ఫీల్డ్ ఆఫీసర్స్ సైదులు,రాజుక్యాషియర్స్ ఉపేంద్ర ,మాలతి, మెసెంజర్ గోవర్ధన్, సిఎల్ఎఫ్ కౌన్సిలర్స్ కామల్ల కిరణ్ కుమార్, డి నాగరాజు, వి ఉమా, సిఎస్ పి మెట్టు నవ్య, సిసి లక్ష్మి గ్రామ దీపికలు రజిత, మెట్టు రాణి,రాంబాయి, నాగేశ్వరి, నర్మద, ఇందిరమ్మ ,గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

