నేటి సాక్షి,ఆసిఫాబాద్:ఆసిఫాబాద్ పట్టణంలోని ఉస్మానియా మస్జీద్ వాడకు చెందిన అహమద్ మోహినుద్దీన్ రెండు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ మృతుని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అహమద్ మోహినుద్దీన్ ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండీ నిజాం, గాజుల జక్కన్న, బాలేష్, బాలకృష్ణ (బాలు), ఈ. సంతోష్, అర్షద్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వైరాగాడే మారుతి, రాహుల్ కాలనీ యువకులు తదితరులు పాల్గొన్నారు.





