Friday, February 13, 2026

*యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి కారణం ఎవరు?*————————————–

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)………………,………………….జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి కారణం ఎమ్మెల్యే కాదా అని అన్నారు.మున్సిపల్ తీర్మానంలో తుంగలో తొక్కి ఎన్నికల్లో లబ్ది కోసం యావర్ రోడ్డు విస్తరణను అడ్డుకున్నారు.ప్రజా ఆస్తులు పరిరక్షించే బాధ్యత ఎమ్మెల్యేకు లేదా అని అన్నారు.సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన ఆక్రమణలు తక్షణమే తొలగించాలి అన్నారు.2008 అనంతరం టైటిల్ లేకుండా నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇచ్చారు.పెట్రోల్ బంక్ పేరిట ఆక్రమణ చేసి నిర్మించిన భవనాలు తక్షణమే తొలగించాలని అని అన్నారు.పెట్రోల్ బ్యాంక్ పేరిట కబ్జాల్లో ఉన్నా, టైటిల్ లేదని కోర్టు స్పష్టంగా పేర్కొంది.యావర్ రోడ్డు 100 ఫీట్లు విస్తరణ చేయాల్సిన ఆవశ్యకత ఉంది.ఎమ్మెల్యే సంజయ్ కుమార్ యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా అనడం విడ్డూరంగా ఉంది.యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యే కారణం కాదా,అని ప్రశ్నించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News