నేటిసాక్షి, మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియా అక్రమ నివారణకు ప్రత్యేక యాప్ ను నమోదు చేసినట్లు, ముందుగా రైతులు గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో తమ వివరాలను నమోదు చేసిన తర్వాత, రైతులు 24గం.లల్లో యూరియా తీసుకెళ్లాలని, దామరచర్ల గ్రామ సర్పంచ్ బంటు రేణుక సిరి అన్నారు. బుధవారం వ్యవసాయ ఆధ్వర్యంలో యూరియా యాప్ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ సర్పంచ్ బంటు రేణుక సిరి మాట్లాడుతూ, రైతులు తప్పక యాప్ లో యూరియా ను ముందుగా బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి రూపేంద్ర మణి మాట్లాడుతూ, పర్టిలైజర్ యూరియా డీలర్లు ప్రతి వివరాలను యాప్ లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బంటు కిరణ్, ఏఈఓ పార్వతీ, కందుల శ్యామ్ సుందర్ రెడ్డి, మన్నెం నాగయ్య, పూర్ణచంద్ర రావు, జనార్ధన్, గ్రామ పెద్దలు రైతులు, తదితరులు పాల్గొన్నారు.

