Tuesday, February 17, 2026

**రేపటినుండిజెర్రిపోతుల గూడెం కనకదుర్గమ్మ జాతర**

నేటి సాక్షి చిలుకూరు చిలుకూరు మండలంలోని జెర్రిపోతుల గూడెం గ్రామంలో ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే కనకదుర్గమ్మ జాతర ( బండ్ల పండుగ )గురు శుక్రవారాల్లో ఘనంగా జరగనున్నది ప్రతి శివరాత్రికి ముందు వచ్చే రెండు గురు శుక్రవారాలు ఈ జాతర జరుపుకోవడం ఆనవాయితీ గా వస్తుంది జాతర సందర్భంగా రైతుల గురువారం ప్రభ బండ్లను అలంకరించి ఊరేగింపుగా ఆలయ వద్దకు తీసుకొని వెళ్లి అక్కడ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవాలయం ఆవరణలో వదిలి రావడం ఆనవాయితీ శుక్రవారం అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించిన అనంతరం వనభోజనాలకు వెళ్తారు జాతర సందర్భంగా వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా కోలాట ప్రదర్శనలు ఏర్పాటు చేశారు జాతరలో ఉదయం కోలాటాలు రాత్రి సంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి జాతర సందర్భంగా దేవాలయం కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు భక్తులు ఎలాంటి ఇబ్బందు లేకుండా ఆవాంఛనీయ ఘటన జరగకుండా ఎస్సై హనుమాన్ నాయక్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని దేవాలయం కమిటీ సభ్యులు కోరారు…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News