Friday, March 13, 2026

*విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి** జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్* బండలింగాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఆకస్మిక తనిఖీ—*

నేటి సాక్షి – మెట్ పల్లి*విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం మెట్‌పల్లి మండలం బండలింగపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, పాఠశాల కార్యకలాపాలను సమగ్రంగా పరిశీలించారు.*బోధన విధానం, హాజరు పరిశీలన*ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న బోధన విధానం, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం, మౌలిక వసతుల స్థితిగతులను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. తరగతి గదుల్లో పాఠ్యాంశాల బోధనపై ప్రశ్నలు అడిగి సెలబస్ అమలు తీరును తెలుసుకున్నారు.*విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ*విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠాలు చదివించడంతో పాటు వారి అవగాహన స్థాయిని ప్రత్యేకంగా పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.*గణితంలో మరింత పురోగతి అవసరం*పదో తరగతి గణితం నోట్‌బుక్‌లను పరిశీలించిన కలెక్టర్, ఈ విషయంపై విద్యార్థులు కొంత వెనుకబడి ఉన్నారని తెలిపారు. ఇంకా పురోగతి సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే రైటింగ్‌పై ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయాలని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్తులో ఏమి అవ్వాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుని, చదువుతో కలిగే ప్రయోజనాలను వివరించి విద్యార్థులను ప్రోత్సహించారు.*FLN, మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక దృష్టి*అనంతరం MPPS పాఠశాలలో మూడో తరగతి FLN (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ)పై పలు ప్రశ్నలు అడిగారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు పోషకాహారం అందేలా చూడాలని ఆదేశించారు.*సన్నబియ్యం, కిచెన్ గార్డెన్ తప్పనిసరి*పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి అవగాహన కల్పించాలని సూచించారు. మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం వినియోగించాలి, వంటకాలకు గ్యాస్ సిలిండర్లు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు వైద్య పరీక్షలు సకాలంలో నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం రోజువారీ వంటకాలు అందేలా పర్యవేక్షణ పెంచాలని తెలిపారు.పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి కె. రాము, ఎంఈవో చంద్రశేఖర్, మండల తహసిల్దార్ నీత, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News