నేటి సాక్షి* తిరుమలాయపాలెం జనవరి 4 రుద్రరాజు మెట్టు.అకాడమిక్ విజిట్ లో భాగంగా తిరుమలాయపాలెం మండలంలోనీ వివిధ పాఠశాలలను సందర్శించడం జరిగింది మొదట బచ్చోడు ఉన్నత పాఠశాల, బచ్చోడు ప్రాథమిక పాఠశాల జూపెడ ప్రాథమిక పాఠశాల, పైనంపల్లి ఉన్నత పాఠశాల, పైనంపల్లి ప్రాథమిక పాఠశాల,కాకరవాయి ఉన్నత పాఠశాల, కాకరవాయి ప్రాథమిక పాఠశాల,సోలిపురం ప్రాథమికోన్నత పాఠశాల మరియు మంగ్యా తండా ప్రాథమిక పాఠశాలలను సందర్శించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ఈసీర్ ఎవరీ చైల్డ్ రీడ్స్ అనే కార్యక్రమాన్ని మరియు ఈనెల లో జరగబోవు ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ ఎఫ్ ఎల్ ఎస్ కి సంబంధించిన అంశాలను మరియు ఫౌండేషనల్ లీడర్స్ మరియు న్యూమరసి అంశాలను పరిశీలించడం జరిగింది. ఉన్నత పాఠశాలలలో లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం విద్యార్థులలోని అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించడం, తరగతి గది లోని బోధనాభ్యసన ప్రక్రియలను పరిశీలించడం జరిగింది.దీనిలో భాగంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించి, విద్యార్థులకు నాణ్యమైన మెరుగైన బోధన అందించడం మరియు విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించుటకై చేయాల్సిన కృత్యాలను వివిధ అంశాలను వారికి సూచించడం జరిగింది. ఈ పర్యటనలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

