నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి. 2 స్థానిక రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి దాత జంట పంచ లోహ దీపాలను విరాళంగా అందించారు, చౌడేపల్లి మోటార్ వీధికి చెందిన శ్రీనివాసులు రూ 50 వేలు విలువచేసే జంట పంచలోహ దీపాలను ఆలయ ప్రధాన అర్చకుడు వశిష్టాచార్యులకు అందించారు, ఈ మేరకు ఆలయంలో విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పిల్లారి జీవన్ ప్రకాష్ .కడియాల రాజన్న .గణేష్ .రంగబాబు .రమేష్ .రాజన్న .కడియాల మహేష్ బాబు. కృష్ణమూర్తి .దాత శ్రీనివాసులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.





