నేటి సాక్షి, నారాయణపేట, జనవరి 23, రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రం కేంద్రంలోని రాయచూరు వెళ్లే రహదారిలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ సరస్వతి దేవి దేవాలయంలో శుక్రవారం నాడు వసంత పంచమి సందర్భంగా ఘనంగా పూజా కార్యక్రమాలను భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి దేవి మాతకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలను ఎల్. శివప్రసాద్ అద్వారంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవలయ కమిటీ సభ్యులు మరికల్ గ్రామస్తులు, అఖిలపక్ష నాయకులు అమ్మవారి దర్శించుకున్నారు. అదేవిధంగా ధన్వాడ మండల కేంద్రంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

