నేటి సాక్షి షాద్నగర్ న్యూస్ *షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయం ముందు బట్టలిప్పి నిరసన వ్యక్తం చేస్తా* *షాద్ నగర్ చౌరస్తా విస్తరణ చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తా* *పట్టణానికి చెందిన యువకుడు ఆర్.ఎన్ రాము వినూత్న నిరసన* *ప్లకార్డులతో చౌరస్తాపై ఆర్.ఎన్ రాము ప్రదర్శన, హెచ్చరిక* రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు కూత పెట్టు దూరంలో ఉన్న షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో రోడ్డు విస్తరణ పనులు లేక ప్రజల ప్రాణాలు పోతున్నాయని, ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే చౌరస్తాను. విస్తరిస్తారని అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నాడు షాద్ నగర్ పట్టణ పౌరుడు ఆర్.ఎన్ రాము. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో ఆర్.ఎన్ రాము వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చౌరస్తాను విస్తరణ చేయండి మహాప్రబో, కాపాడండి మా ప్రాణాలను అంటూ ప్లకార్డులను ప్రదర్శించి అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీశాడు. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోయాయని, ఇటీవల పట్టణానికి చెందిన తండ్రి కూతుర్లు మచ్చేందర్, మైత్రిలు గత జులై 26న నడి చౌరస్తాపై దిక్కులేని చావు చచ్చారని ఇంకా ఎంతోమంది ప్రాణాలు పోయాయని కొంతమందికి క్షతగాత్రులై అంగ వికలాంగులు అయ్యారని ఇంత జరుగుతున్న స్థానిక మున్సిపాలిటీ ఇతర శాఖల అధికారులు ఏమాత్రం ప్రతిస్పందించడం లేదని ఆర్.ఎన్ రాము ఆవేదన చెందారు. గతంలో స్థానిక మున్సిపాలిటీలో అదేవిధంగా ఆర్డీవో కార్యాలయంలో, తాహసిల్దార్ కార్యాలయంలో, అదేవిధంగా మునిసిపల్ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నత అధికారికి సైతం లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తను ఆయా కార్యాలయాల్లో ఫిర్యాదు చేసిన సమయంలో చౌరస్తా విస్తరణకు ఇంకా ఎంత సమయం పడుతుంది అని ప్రశ్నిస్తే సరైన సమాధానం రావడంలేదని రాము ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ అండ్ బి కార్యాలయంలో అధికారులను ప్రశ్నిస్తే అది మాకు సంబంధం లేదు మున్సిపల్ కార్యాలయంలో పెండింగ్లో ఉందని అక్కడ అడగాలని చెబుతున్నారని తాను మున్సిపల్ కార్యాలయంలో అధికారిని అడిగితే విస్తరణ పనులపై కేసు ఉందని చెబుతున్నారని కేసు వివరాలను వెల్లడించమని తాను కోరుతున్న పట్టించుకోవడంలేదని తెలిపారు. ముఖ్యంగా కేసు వివరాలు తమకు ఇస్తే న్యాయస్థానంలో జడ్జిని ప్రాధేయపడిన రోడ్డు విస్తరణకు న్యాయం చేయమని కోరుతామని తమ వివరాలు అందించాలని రాము ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఇలాగే నిర్లక్ష్యం కొనసాగితే మున్సిపల్ కార్యాలయం ముందు తాను త్వరలోనే బట్టలు విప్పి మరి తన నిరసన తెలియజేస్తానని హెచ్చరించారు. అంతేకాదు తన ఈ పోరాటం ఆగదని పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని పాలకులను అధికారులను రాము హెచ్చరించారు.. *KP*

