Friday, February 13, 2026

స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రేపాల జాతర కరపత్రాల ఆవిష్కరణమునగాల,

నేటి సాక్షి సూర్యపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో నిర్వహించనున్న స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతరకు సంబంధించిన కరపత్రాలను కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఘనంగా విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రేపాల గ్రామంలోని స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతరకు విశేష చరిత్ర, భక్తుల ఆదరణ ఉందని పేర్కొన్నారు. జాతరను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించుకోవాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సారిక చిన్నరామయ్య , యలక నరేందర్ రెడ్డి, బెజవాడ సీతారాములు, గండు వీరబాబు, రావుబుచ్చిరెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు పల్లి సైదిరెడ్డి, రావులపెంట సతీష్ , తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News