నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ మున్సిపల్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రైల్వే స్టేషన్ ముందు తెలంగాణ శాసనసభ సభాపతి వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ సతీమణి స్వర్గీయ శ్రీమతి. గడ్డం శైలజ గారి 5 వ వర్ధంతి సందర్భంగా వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ. అర్ద. సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గడ్డం శైలజ గారి లేని లోటు వికారాబాద్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని ప్రసాద్ కుమార్ కి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు నడిపించారని స్మరించుకున్నారు..అదేవిధంగా వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు అండగా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ v. సత్యనారాయణ , డీసీసీబీ జిల్లా డైరెక్టర్ కిషన్ నాయక్, వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ అనంత రెడ్డి, నర్సింలు, ముత్తార్ షరీఫ్ గారు, కౌన్సిలర్ లు రెడ్యానాయక్, మురళి వేణుగోపాల్ రెడ్డి,అసిఫ్, మరియు నాయకులు ప్రభాకర్ రెడ్డి, జంగయ్య, యాదగిరి, బందయ్య,మార్కెట్ డైరెక్టర్లు పాపి రెడ్డి, రమేష్ నాయక్,మిర్యానం. సురేష్, రాజు నాయక్, గజేందర్,అంజయ్య, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

