నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)స్వాతంత్ర పోరాటం లో వీరోచిత పోరాటం చేసిన ఏకైక పార్టీ సిపిఐ అని స్పష్టం చేశారు. స్వాతంత్ర పోరాటం లో ఆర్ ఎస్ ఎస్ బ్రిటిష్ ప్రభుత్వానికి ఊడిగం చేశారు అని తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం సిపిఐ శతాబ్ది శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా తిరుపతి సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో బైరాగి పట్టెడ రాయలసీమ కాలేజీ నుండి రామానాయుడు స్కూల్, పద్మావతి పార్క్ మీదుగా సిపిఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కే నారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం జె విశ్వనాథ్ అధ్యక్షత న జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ భూ పోరాటం లో లక్షలాది ఎకరాలు ఆక్రమించి పేదలకు పంచి పెట్టడం జరిగింది అన్నారు. చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు వేలాది మంది కి సాగు భూములు, ఇళ్ల స్థలాలు ఏ ఒక్క బూర్జువా పార్టీ ఒక్క సెంటు భూమి పంచలేదు అన్నారు. కానీ సిపిఐ భూ పోరాటం ద్వారా భూములు పంచి పెట్టడం జరిగింది అన్నారు. రాజకీయాలను ప్రభుత్వాలు భ్రష్టు పట్టిస్తున్నాయని విద్యార్థి సంఘాలకు ఎన్నికలు ఉన్నప్పుడు ఎంతో మంది రాజకీయ నాయకులు గా ఎదిగారు అన్నారు. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు రద్దు చేసిన ఘనతా చంద్రబాబు కు దక్కింది అన్నారు. 10 లక్షల కోట్లు పేదల ఉపాధి కి ఖర్చు చేసిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల కోసం 28 లక్షల కోట్లు మాఫీ చేశారు అని విమర్శించారు.ఉపాధి హామీ పథకం పేరు ఎందుకు మారుస్తున్నారూ. సమాధానం చెప్పాలి. దీన్ని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదు సమాధానం చెప్పాలి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వాలను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోంది అన్నారు.హత్యలు, అరాచకాలు చేసిన వారికి కేంద్రం అండగా ఉండి అని, న్యాయ వ్యవస్థను సైతం తమ కనుసన్నల్లో నడిపిస్తున్నారు అన్నారు.పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కలిసి నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చివేశారు అన్నారు.ఉపాధి హామీ పథకం మార్చి వేస్తుంటే మద్దతు పలికి నేడు డిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం ను దేహి అని బిక్షం ఆడుకుంటున్నాడు అని ద్వజమెత్తారు.పారిశ్రామిక అభివృద్ధి కోసం విలువైన భూములను వేలాది ఎకరాలు బడాబాబుల అప్పగిస్తున్నారని విమర్శించారు.అడవుల్లో ఉన్న నక్సల్స్ ను చంపి గిరిజనులను తరిమివేసి అటవీ భూములను కార్పొరేట్ లకు అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారని ఇది నిజమైన అభివృద్ధి కాదు అన్నారు.ప్రాథమిక హక్కులైన విద్య, వైద్యాన్ని ప్రవేటు కు అప్పగించడం గొర్రెను కసాయి కి అప్పగించినట్లే అన్నారు. సిపిఐ గడచిన పోరాటాల స్పూర్తి తో మతోన్మాద బిజెపి శక్తులపై పోరాటాలను ఉదృతం చేయాలని పిలుపును ఇచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ సిపిఐ వంద సంవత్సరాల కాలం లో అధికారం లో లేకపోయినా రాజకీయ లలో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది అన్నారు. కమ్యూనిస్టులకు కాలం చెల్లింది అని చెప్పేవారు పదే పదే ఎందుకు కమ్యూనిస్టుల గురించి ప్రస్తావిస్తున్నారు సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు . అనేక మంది పేద ప్రజానీకం సమస్యలు పరిస్కరించింది కాబట్టి నేటికి పార్టీ కి అండగా కార్యకర్తలు ఉన్నారు అని స్పష్టం చేశారు.స్వాతంత్రం అనంతరం సామాజిక రుగ్మతల పై కమ్యూనిస్టు పార్టీ అనేక ఉద్యమాలు చేసి వాటిని రూపు మాపేందుకు పాటుపడింది అన్నారు.బడుగు బలహీన వర్గాల జీవనం మెరుగు పడాలి అంటే భూమి ఉండాలి అని దున్నే వాడిదే భూమి అని పోరాటాలు చేయడం జరిగింది అని పేర్కొన్నారు.దున్నగలిగే వాడికే భూమి అని బి జెపి భూస్వాములకు అండగా నిలిచింది అన్నారు.అభ్యుదయ రచనలు చేస్తున్న వారిని అరెస్టులు చేస్తున్నారు అని, కాల్చి చంపుతున్నారు అని విమర్శించారు.చరిత్రను మార్చి వేసే కుట్రలు చేస్తున్నారు అన్నారు. బీహార్ ఎన్నికల్లో జరిగిన ఓట్ల అవినీతి బట్టబయలు అయ్యింది ఐన మోడీ సిగ్గులేకుండా మేమే గెలిచామని చెప్పు కోవడం సిగ్గు చేటన్నారు . శత వార్షికోత్సవాల సందర్భంగా మన పార్టీని, ప్రజా సంఘాల ను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. నగర కార్యదర్శి విశ్వనాథ్ అధ్యక్షతన జరిగింది.సభ ప్రారంభానికి ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో డప్పు కళాకారులు డప్పుల చప్పుళ్లతో ర్యాలీ లో అగ్రభాగాన నిలిచారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చారులత, జె నాగరాజు,నాగభూషణం , డప్పు సూరి, ఫ్లూట్ సుబ్బు, హరినాథ్, శేఖర్, మరియు చిన్న పిల్లలు గాయకులు చే ఎర్రజెండా గొప్ప తనాన్ని వివరిస్తూ విప్లవ గేయాలు ఆలపించారు .ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ,నదియా, మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు జయలక్ష్మి, , నగర సహాయ కార్యదర్శి బండి చలపతి, కార్యవర్గ సభ్యులు ఉదయ్ కుమార్, మహేంద్ర, రాజా, శివ,మంజుల తదితరులు పాల్గొన్నారు.

